కుప్పం,సెప్టెంబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్):ఎస్ వి యూనివర్సిటీ విడుదల చేసిన మూడవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల చైర్పర్సన్ శాంతానాగరాజ్ తెలిపారు. బి సి ఎలో లోహిత – 8.94 పాయింట్స్, రమ్య – 8.90 పాయింట్స్ బీకాం సీఏ లో లో స్వేత – 8.90 పాయింట్స్, మదులత – 8.47 పాయింట్స్, బి బి ఏ లో పవిత – 8.61 పాయింట్స్, స్పందన – 8.54 పాయింట్స్, బి ఎస్ సి ,సి ఎస్ లో నందు పూర్ణిమ – 8.25 పాయింట్స్, సాయిప్రియ-7.90 పాయింట్స్, బీఎస్సీ సిహెచ్ నందు దీపిక – 7.05 పాయింట్స్, పల్లవి – 6.77 పాయింట్స్ మార్కులతో కళాశాలలో మొదటి స్థానంలో ర్యాంకులు సాధించారని తెలిపారు. అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నందు ‘ ఒకరు 10 కి 10 పాయింట్స్, మ్యాథమాటిక్స్ అండీ స్టాటిస్టికల్ పౌండేషన్స్ నందు ఒకరు 10 కి10 పాయింట్స్ సాధించారు. ఈ అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల చైర్ పర్సక్ శాంతా నాగరాజ్, వైస్ చైర్మేన్ సాగర్ రాజ్, ప్రిన్సిపాల్ సుధారాణి అభినందించారు. ఈ కార్యక్రమంలో అద్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం
RELATED ARTICLES
