ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న ఎమ్మెల్యే అమర్ పర్యటన

పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న ఎమ్మెల్యే అమర్ పర్యటన

📰 Generate e-Paper Clip

*ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి అపూర్వ స్పందన

*అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేకు నీరాజనాలు పడుతున్న జనం

*గజమాలలు, మంగళ హరతులతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం తెలుపుతున్న మహిళలు, యువత

*రెండో రోజు బైరెడ్డిపల్లిలో సూపర్ హిట్ అయిన ఎమ్మెల్యే కార్యక్రమం

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్3

పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేపడుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం రెండో రోజు అయిన గురువారం లక్కనపల్లి, గొల్లచీమనపల్లి, ఆలపల్లి పంచాయతీల పరిధిలోని గ్రామాలలో పండుగ వాతావరణాన్ని తలపించేలా సాగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ముఖ్యంగా గ్రామాలలోని మహిళలు, యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తి చెందుతూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేశారు. అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పర్యటన బైరెడ్డి పల్లి మండలంలో దిగ్విజయంగా సాగుతోంది. మండల పరిధిలోని చాలా గ్రామాలకు రోడ్లను నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు దాదాపు అన్ని గ్రామాలలో రోడ్లు రెండేళ్లలో పూర్తి చేయడం జరిగింది. దీంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమ గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యేను భారీ గజమాల లతో సత్కరిస్తూ ప్రజలు పూల వర్షం కురిపిస్తూన్నారు. ఇలా ఉండగా ఎమ్మెల్యే సైతం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ మరోవైపు గ్రామాలలో ఇప్పటికి నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ పర్యటనలో ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా లక్కన పల్లె పంచాయతీ పరిధిలో గ్రామస్తులు తమ ఆటపాటలు, సాంస్కృతి కార్యక్రమాలతో ఆయనను ఘనంగా ఆహ్వానించారు.

*ఎమ్మెల్యే పర్యటించిన గ్రామాలు*
లక్కన పల్లి పంచాయతీలోని చిన్నపురం, పెద్దపురం, గడ్డిండ్లు, తొరడి,లక్కనపల్లి,శెట్టిపల్లి రామనపల్లి, గొల్ల చీమలపల్లి పంచాయతీ పరిధిలోని గడ్డిండ్లు, గాజీపేట,మురారిపల్లి, తావడ కుప్పం, గొల్ల చీమనపల్లి గానిపల్లి, ఆలకుప్పం పంచాయతీ పరిధిలోని మునిరాజపురం, నాచుకుప్పం, ఆలపల్లి,మూగనపల్లి, మిట్టప్పల్లిలలో ఆయన పర్యటించారు.

*ఎమ్మెల్యే చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవాలు*

పిఎస్ రోడ్డు నుండి కేపీ రోడ్డు వరకు శెట్టిపల్లి మరియు చిక్కనపల్లి అండ్ బురిశెట్టిపల్లి మీదుగా రూ. 3.09 కోట్లతో నిర్మాణం చేపట్టిన రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు…

పెద్దపురం గ్రామంలో రూ.4.65 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు…

లక్కనపల్లి గ్రామంలో 15 లక్షలతో నిర్మించిన సీమెంట్ కాలువ ను ప్రారంభించారు…

శెట్టిపల్లి నందు 9.40 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు…

శెట్టిపల్లిలో 12 లక్షలతో నిర్మించిన అంగనవాడి నూతన భవనాన్ని ప్రారంభించారు….

రామనపల్లిలో 8.20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు….

ఈ కార్యక్రమాలలో పలమనేర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కోపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్.వి బాలాజీ, బైరెడ్డిపల్లి మండల నాయకులు కిషోర్ గౌడ, సుబ్రహ్మణ్యం శెట్టి, పళని, మంజునాథరెడ్డి, రఘుచంద్రగుప్త, సుబ్బారెడ్డి, మునస్వామి రెడ్డి మరియు అధికారులు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!