ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

📰 Generate e-Paper Clip

పలమనేరు, సెప్టెంబర్ 15 ( గరుడ ధాత్రి ) :

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు తిరుపతి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంగళవారం సాయంత్రం పలమనేరు శాసన సభ్యులు అమరనాథరెడ్డి సాధర స్వాగతం పలికి మర్యాద పూర్వకంగా కలిశారు.మూడు రోజులు క్రితం మునిసిపాలిటీ పరిధిలోని పలు వార్డ్ లలో ముమ్మరంగా పర్యటించి కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు అలుపెరుగక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపిన శాసన సభ్యులు అమరనాదరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉండడంతో అధినేతను ఆప్యాయంగా కలిశారు. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ పేరొందిన అమరనాదరెడ్డి టిడిపిలో సీనియర్ నేత అన్న విషయం తెలిసేందే.గత ఎన్నికలకు ముందు మంత్రి నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర కుప్పంలో ప్రారంభం నుంచి రాయలసీమ జిల్లాలు ముగిసేవరకు లోకేష్ వెన్నoటే నడచిన చరిత్ర అమరనాదరెడ్డిది. ప్రత్యేకించి సొంత నియోజకవర్గం పలమనేరులో ప్రతి కార్యకర్తను పేరుపెట్టి పిలిచే అమరనాదరెడ్డిని అభిమానులు అమరన్నగా పిలుచుకోవడం తెలిసిన విషయమే.అదినాయకుడి ఆలోచనలకు తగిన విధంగా నడుచుకొంటూ నియోజకవర్గం లో అటు పార్టీని,ఇటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను అధికారులు ద్వారా చేపడుతూ ప్రజలకు అత్యంత చేరువగా వుంటున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అమరన్న తిరుగులేని ముద్ర ఉంటుందని పార్టీ శ్రేణులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!