ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిముసాయిదా పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ వర్మ

ముసాయిదా పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ వర్మ

📰 Generate e-Paper Clip

పలమనేరు, సెప్టెంబర్ 23 ( గరుడ ధాత్రి ) :

పలమనేరు పురపాలక సంఘ పరిధిలో జరగనున్న మున్సిపల్ సాధారణ ఎన్నికలు-2026 కోసం అధికార యంత్రాంగం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బుధవారం మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ పట్టణంలోని పలు ముసాయిదా పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని మొత్తం 36 వార్డులకు సంబంధించి 28 ప్రాంతాల్లో 72 ముసాయిదా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా కమిషనర్ అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో విధిగా తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు తగినన్ని ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వయోవృద్ధులు, దివ్యాంగులు సులభంగా లోపలికి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ర్యాంపులు నిర్మించాలని సూచించారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా శుభ్రమైన మరుగుదొడ్లను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. రాబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు పురపాలక యంత్రాంగం అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని ఆయన వెల్లడించారు.

పోలింగ్ కేంద్రాల జాబితా షెడ్యూల్:

సెప్టెంబర్ 25 ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా అధికారిక ప్రకటన.
సెప్టెంబర్ 26 ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, సలహాల స్వీకరణకు తుది గడువు.
సెప్టెంబర్ 28 వచ్చిన అభ్యంతరాల పరిశీలన అనంతరం పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురణ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ సురేష్ , మున్సిపల్ మేనేజర్ మొహిద్దీన్ , పట్టణ ప్రణాళిక అధికారులు, ఇంజనీరింగ్ విభాగపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!