ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎన్ఎస్ఎస్ విద్యార్థులు సమాజ పురోభివృద్ధి కోసం పనిచేయాలి

ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సమాజ పురోభివృద్ధి కోసం పనిచేయాలి

📰 Generate e-Paper Clip

* ద్రావిడ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్ కుమార్.
* ద్రావిడ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ దినోత్సవం.
కుప్పం,సెప్టెంబర్ 24 (గరుడ ధాత్రి న్యూస్): ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సమాజ పురోభివృద్ధి కోసం పనిచేయాలని త్రావిడ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ఆచార్య కిరణ్ కుమార్ అన్నారు.ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్రావిడ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ఆచార్య వి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు సమాజ పురోభివృద్ధి కోసం పనిచేయాలని తెలియజేశారు
యు జి సి విద్య తో పాటు సమాజ సేవ చేయాలన్న సదుద్దేశంతో ఎన్ఎస్ఎస్ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఆ దిశగా విద్యార్థులు చదువుతోపాటు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని తెలియజేశారు. ఎన్ఎస్ఎస్ డే ని నిర్వహించడం ముదావహమని ఎన్ఎస్ఎస్ టీమ్ ని అభినందించారు.
డీన్ అకడమెక్ అఫైర్స్ ఆచార్య కె. శ్యామల మాట్లాడుతూ సమాజంలో ఉన్న దురన్యాయాలను ఎత్తిచూపే వారు ప్రతి తరంలోనూ ఉంటారని తెలియజేశారు. ప్రతిక్షణం చాట్ జిపిటి, జెమినీ, జ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా ఉపయోగించుకోవాలి కానీ మొబైల్ తో ఎక్కువ టైం గడపడం వలన నేటి యువత అనేక సమస్యలకు, దురాలవాట్లకు
లోనవుతుందని తెలియజేశారు.
ద్రావిడ విశ్వవిద్యాలయం యూజీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్ విజయ వర్ధిని మాట్లాడుతూ నేటితరం అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది దీని ద్వారా దీని ద్వారా ప్రపంచాన్ని ఉన్నచోట నుండి చూడగలుగుతున్నాం నేటి యువత ప్రగతి పథంలో పయనించడానికి విద్యా విధానంలో అనేక రకాల పథకాలు విద్యార్థుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేయబడ్డాయని వాటిని అందిపుచ్చుకొని తమ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని తెలియజేశారు.
సరికొండ మహేష్ ఆర్కిటెక్ మాట్లాడుతూ చరిత్రకు సంబందించిన ఆధారాలను ముందుగా సేకరించినప్పుడే ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్తి జ్ఞానము లభిస్తుందని తెలియజేశారు. ఒక గ్రామంలో చెక్కబడిన విగ్రహం దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలిసినవారు మాత్రమే ఆ గ్రామానికి సంబంధించిన చరిత్రను తర్వాత తరానికి అందించగలుగుతారు. అ దిశగా విద్యార్థులు పనిచేయాలని కోరారు.మన చరిత్ర మానవ మూలాలను తెలుసుకోవడం ద్వారా మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దుకోగలమని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం
ద్రావిడ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్
శ్రీ హర్షవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థులు నవ చైతన్యాన్ని కలిగి ముందుకు పయనించాలని తెలియజేశారు.కుప్పిగాని పల్లెలో జరిగిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న
ఎన్ఎస్ఎస్ విద్యార్థులను సన్మానించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ద్రావిడ విశ్వవిద్యాలయం
ఎన్ఎస్ఎస్ విభాగానికి చెందిన ప్రోగ్రామింగ్ ఆఫీసర్స్, వివిధ శాఖలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు,పరిశోధక విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!