ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపచ్చదనాన్ని పెంపొందించడం, చెట్లను రక్షించడం అందరి బాధ్యత

పచ్చదనాన్ని పెంపొందించడం, చెట్లను రక్షించడం అందరి బాధ్యత

📰 Generate e-Paper Clip

* బీసీఎన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బి.సి. నాగరాజ్.
* కేఈసి లో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవం.
* మొక్కలు నాటిన బీసీ నాగరాజ్, డాక్టర్ సునీల్ రాజ్.
కుప్పం,సెప్టెంబర్ 24 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి): పచ్చదనాన్ని పెంపొందించడం, మొక్కలను సంరక్షించడం అందరి బాధ్యత అని బీసీఎన్ విద్యా సంస్థల అధినేత బీసీ నాగరాజ్ అన్నారు.
కుప్పం ఇంజినీరింగ్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ ఎస్ ఎస్ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బి సి ఎన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ డా. బి. సి. నాగరాజ్, కుప్పం ఇంజినీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డా. ఎన్. సునీల్ రాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డా. బి. సి. నాగరాజ్ స్వయంగా మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. పచ్చదనం పెంపొందించడం, చెట్లను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన సూచించారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, పచ్చని వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, హెచ్ ఓ డి లు, సెక్షన్ ఆఫీసర్లు, ఎన్ ఎస్ ఎస్ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు చురుకుగా పాల్గొన్నారు. నేను కాదు నీవు అనే ఎన్ ఎస్ ఎస్ నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత మరియు పచ్చదనం పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించారు. నాటిన మొక్కలను సంరక్షిస్తూ కళాశాలను పచ్చని, పరిశుభ్రమైన మరియు సుస్థిరమైన ప్రాంగణంగా తీర్చిదిద్దేందుకు అందరూ ప్రతిజ్ఞ చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!