కార్వేటినగరం సెప్టెంబర్ 24 ( గరుడ దాత్రి న్యూస్):
కార్వేటి నగరం
మండల పరిధిలోని ఆర్కే వీబిపేట గ్రామానికి ఎనిమిది పర్యాయాలు పంచాయతీ సర్పంచ్ గా వెంకటరెడ్డి ప్రజలకు ఎంతో సేవలు అందించారని సత్య వేడు వైసిపి ఇంచార్జ్ రాజేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎం ఆర్ వివెంకట రెడ్డి 92 అనారోగ్యంతో సిమ్స్ లో చికిత్స పొందుతూ అనారోగ్యంతోమృతి చెందారు. ఆయన మృతదేహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయితీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్కే విబీపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. అదేవిధంగా ఇందిరా కాలనీ ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఎనలేని సేవలు అందించారన్నారు. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారన్నారు. ఈయన మృతదేహానికి మాజీ జెడ్పిటిసి దేవకి లోకనాథ్ రెడ్డి, పొల్యూషన్ బోర్డ్ డైరెక్టర్ నాగేశ్వరరాజు, రిటైర్డ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాజు, జనసేన నియోజకవర్గం బాధ్యులు యుగంధర్, మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రాయ యాదవ్, ప్రధాన కార్యదర్శి రాజా, బిజెపి నాయకుడు నడింపల్లి యువరాజు, పూలమాలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా కార్వేటి నగరం మండలం, వెదురు కుప్పం మండలం, శ్రీ రంగరాజపురం మండలం, తిరుపతి నుండి పలువురు నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
