చిత్తూరు సెప్టెంబర్ 28 (గరుడదాత్రిన్యూస్)
గ్రామీణ ప్రాంతాల్లోనిప్రత్యేకఅవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు గుడిపాలలో ఆటిజం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు చెప్పారు. సోమవారం చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద్ రావు గారితో కలిసి అటిజం కేంద్ర భవన నిర్మాణానికి శాస్త్రవేత్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. సర్వ శిక్ష అభియాన్ కింద రూ.28 లక్షల వ్యయంతో ఆటిజం కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నరహరి పేట ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఇటీవల క్రీడల్లోరాణించినవిద్యార్థులకు మరిన్ని సౌకర్యాల కోసం ఎమ్మెల్యే రూ.10,000 ఎంపీ చేతుల మీదుగా అందించారు. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శిరీష, తహశీల్దారు శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడుసుబ్బానాయుడు,ధనసింగ్,బాలసుబ్రహ్మణ్యం యాదవ్, పీఏసీఎస్ అధ్యక్షుడు ప్రతాప్ నాయుడు, మాజీ ఎంపీపీలు అనిల్ దీపశ్రీ, గోళ్ల హరి, నాగరాజు యాదవ్, మాజీ జడ్పీటీసీ సుమతి, గోళ్ల హేమాద్రి నాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు
