ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపాన్ ఐఐటీ సమ్మిట్లో సీఎం చంద్రబాబు ఆవిష్కరణల పరిశీలన

పాన్ ఐఐటీ సమ్మిట్లో సీఎం చంద్రబాబు ఆవిష్కరణల పరిశీలన

📰 Generate e-Paper Clip

చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): విజయవాడ అంబేద్కర్ కళావేదికలో శనివారం నిర్వహించిన ‘పాన్ ఐఐటీ సమ్మిట్’కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాంగణంలో ఐఐటీయన్లు, వివిధ స్టార్టప్లు ఏర్పాటు చేసిన నూతన ఆవిష్కరణల స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆక్సి ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన అత్యాధునిక డ్రోన్ను వీక్షించిన సీఎం, ఆ ప్రతినిధుల కోరిక మేరకు డ్రోన్పై తన సంతకం చేశారు. అలాగే సాధారణ పెట్రోల్ టూవీలర్లను కేవలం కొద్ది గంటల్లోనే ఈవీ (ఈ-వాహనాలు)గా మార్చే సాంకేతికత కలిగిన ఒక స్టార్టప్ స్టాల్ను సందర్శించి, ఆ కన్వర్షన్ విధానాన్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు. పర్యావరణహితమైన ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, తగిన ప్రోత్సాహం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. చిన్నారులతో కలిసి ఫోటోలు దిగారు.ఈ సదస్సులో 50 మందికి పైగా సీఈఓలు, 100 మందికి పైగా యూనికార్న్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఇంధనం, డీప్ టెక్, స్పేస్, డిఫెన్స్, అగ్రిటెక్ వంటి అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది ఐఐటీ పూర్వ విద్యార్థుల అనుభవాన్ని, వనరులను రాష్ట్రాభివృద్ధికి జోడించడంపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు, సుస్థిరాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం పాన్ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకోనుంది. అనంతరం ప్రాంగణంలోని స్టాళ్లను సీఎం పరిశీలించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!