ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రయాణికులు వేచిఉన్నా.. ఆగని ఆర్టీసీ బస్సులు..!

ప్రయాణికులు వేచిఉన్నా.. ఆగని ఆర్టీసీ బస్సులు..!

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం, అక్టోబర్ 3 గరుడ ధాత్రి న్యూస్ :

కార్వేటినగరంలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉన్నప్పటికీ కొన్ని ఆర్టీసీ బస్సులు నిలపకుండా వెళ్లిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి నుంచి పల్లిపట్టు వరకు నడిచే ఆర్టీసీ బస్సులు కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆలయ ఆర్చ్‌, ఆర్టీసీ బస్టాండ్‌, పచ్చికాపలం రోడ్డు ప్రాంతాల్లో సాధారణంగా ఆగుతుంటాయి. అయితే శనివారం మధ్యాహ్నం సుమారు 3.10 గంటల సమయంలో పల్లిపట్టు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న “ఏపీ 29 జెడ్ 3430” నంబర్ గల ఆర్టీసీ బస్సును వేణుగోపాలస్వామి ఆలయం వద్ద ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ డ్రైవర్ బస్సును నిలపకుండా వెళ్లిపోయినట్లు ప్రయాణికులు తెలిపారు.
బస్సు కోసం వేచి ఉన్న ఓ మహిళ, ద్విచక్ర వాహనంపై పెద్దకనుమ వరకు చేరుకున్న బస్సు వద్దకు తీసుకెళ్ళినట్లు తెలిసింది. అక్కడ బస్సు డ్రైవర్‌ను ప్రశ్నించగా తనతో దురుసుగా మాట్లాడి దుర్భాషలాడినట్లు బీసీ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షురాలు నాగరత్నం ఆరోపించారు. ఈ ఘటనపై ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండగా, బస్సులు ఎందుకు నిలపడం లేదని ప్రశ్నిస్తే.. వెనుక మరో బస్సు వస్తుందని, అందులో రావాలని సమాధానం ఇస్తున్నారని నాగరత్నం పేర్కొన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్ణీత స్టాప్‌లో బస్సులు నిలిపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
అదేవిధంగా పుత్తూరు డిపోకు చెందిన పుత్తూరు-చిత్తూరు ఆర్టీసీ బస్సు సైతం సుమారు 3.45 గంటల సమయంలో వినాయకపురం రోడ్డు వద్ద ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించినా నిలపకుండా వెళ్లిపోయినట్లు పలువురు ప్రయాణికులు ఆరోపించారు.
మరోవైపు కొందరు ఆర్టీసీ డ్రైవర్లు డ్రైవింగ్‌ సమయంలో సెల్‌ఫోన్లు మాట్లాడుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అలాగే డ్రైవర్లు హాన్స్ మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువుగా ఉందని ఆమె తెలిపారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పుత్తూరు డిపో అధికారులు బస్సుల రాకపోకలపై నిఘా పెంచాలని, నిబంధనలు ఉల్లంఘించే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!