ePaper
Thursday, October 8, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిజాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన సత్యవేడు విద్యార్థులు

జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన సత్యవేడు విద్యార్థులు

📰 Generate e-Paper Clip

-బంగారు పతకాలతో మెరిసిన చిన్నారులు..
-అభినందించిన అతిథులు, నిర్వాహకులు

సత్యవేడు అక్టోబర్ 4 గరుడధాత్రి :

ఆల్ ఇండియా స్కూల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 1వ ఆల్ ఇండియా స్కూల్ స్పోర్ట్స్ నేషనల్ ఛాంపియన్‌షిప్–2026 సత్యవేడు జీజే కాలేజీలో ఘనంగా జరిగింది. జాతీయ స్థాయి పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పాల్గొనగా, కరాటే విభాగంలో సత్యవేడు విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పెద్ద సంఖ్యలో బంగారు, రజత పతకాలు సాధించారు.
కార్యక్రమానికి గౌరవ అతిథిగా శ్రీమతి రేవతిమ్మ హాజరై విజేతలైన విద్యార్థులను అభినందించారు. సత్యవేడు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎం.ఏ. భాస్కర్, జనరల్‌ సెక్రటరీ డి. హేమకుమార్‌ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. కరాటే విభాగంలో కోచ్‌లు భువనేష్, ధనుష్ శిక్షణలో విద్యార్థులు కటా, కుమితే విభాగాల్లో పోటీపడి సత్తా చాటారు.

పతకాల పంట

కటా బాలికల విభాగంలో అండర్‌–8లో లక్షిక బంగారు, మోషిక రజతం, అండర్‌–10లో నాజియా బాను బంగారు, ప్రియా రజతం, అండర్‌–12లో పూర్విక బంగారు పతకం సాధించారు.

కటా బాలుర విభాగంలో అండర్‌–10లో జెశ్వనాథ్ బంగారు, అబూబకర్ రజతం, అండర్‌–12లో అరిఫ్ బంగారు, ప్రద్యుమ్న రజతం, అండర్‌–14లో మోహిత్ బంగారు, యోగిత్ రజత పతకాలు సాధించారు.

కుమితే బాలికల విభాగంలో అండర్‌–8లో మోషిక (20 కేజీలు), అండర్‌–10లో ప్రియా (22 కేజీలు), నాజియా బాను (31 కేజీలు), అండర్‌–12లో పూర్విక (32 కేజీలు), అండర్‌–14లో తేన్మొళి (34 కేజీలు), హేమలత (40 కేజీలు), అక్షయ (46 కేజీలు) బంగారు పతకాలు సాధించారు.

కుమితే బాలుర విభాగంలో అండర్‌–10లో అబూబకర్ (40 కేజీలు), జెశ్వనాథ్ (31 కేజీలు), అండర్‌–12లో అతీఫ్ (32 కేజీలు), ప్రద్యుమ్న (50 కేజీలు) బంగారు పతకాలు, పవన్‌కుమార్ (32 కేజీలు) రజత పతకం సాధించారు. అండర్‌–14లో మనోజ్ (26 కేజీలు), దికక్ (31 కేజీలు), మోహిత్ (38 కేజీలు), మురళి (43 కేజీలు), యోగిత్ (50 కేజీలు) బంగారు పతకాలు సాధించారు. అండర్‌–17లో రాకేష్ (46 కేజీలు) బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.

విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించడమే జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌ నిర్వహణ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన విద్యార్థులను కోచ్‌లు, నిర్వాహకులు, అతిథులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!