* త్వరలో 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు.
* 55 లక్షలతో సిమెంట్ రోడ్.
* కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్.
కుప్పం, అక్టోబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం సమీపంలోని పరమసముద్రం వద్ద ఉన్న బేటారాయస్వామి కొండ ప్రాంతాన్ని ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొండ వద్ద నుండి పైకి వరకు 55 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. కొండ కింద ప్రాంతంలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేశామన్నారు. పలు అభివృద్ధి పనులకు 15 కోట్ల రూపాయలు మంజూరు అయిందన్నారు. త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు. కర్ణాటక తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాల ప్రజలకు ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న బేటరాయ స్వామి కొండ ప్రాంతాన్ని 100 శాతం ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారన్నారు. మూడో తేదీ శనివారం బయటదాయ స్వామి కొండ వద్ద టీటీడీ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం విజయవంతంగా కొనసాగిందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం, టిటిడి పాలకమండలి సభ్యులు శాంతారామ్, పి కే యం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, నాయకులు వల్లప్ప, సంతోష్, రాజగోపాల్ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్, పలువురు నాయకులు, సమీప గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
