ePaper
Monday, October 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎమ్మెల్యే అమరనాథ్‌ రెడ్డికి నగరి టీడీపీ నాయకుల ఘన సత్కారం

ఎమ్మెల్యే అమరనాథ్‌ రెడ్డికి నగరి టీడీపీ నాయకుల ఘన సత్కారం

📰 Generate e-Paper Clip

పలమనేరు, అక్టోబర్ 11, గరుడ ధాత్రి :

చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతలు స్వీకరించిన పలమనేరు శాసనసభ్యులు ఎన్. అమరనాథ్‌ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కీలక బాధ్యతలు చేపట్టిన ఆయనను నగరి మున్సిపాలిటీకి చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి. నగరి మున్సిపాలిటీ సీనియర్ నాయకులు రామానుజం చలపతి, మాజీ కౌన్సిలర్ లత ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అమరనాథ్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనకు గజమాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. రాబోయే స్థానిక ఎన్నికల బాధ్యతల్లో ఆయన దిగ్విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, శుభ సూచకంగా వినాయక ప్రతిమను బహుకరించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చలపతి, లతలతో పాటు తెలుగు మహిళా విభాగం నాయకురాళ్లు కన్నెమ్మ, అలిమేలు, రాధ, హేమ, రాజేశ్వరి, మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుణ, వెంకటేష్, బాబు, జయవేలు, విశ్వ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!