27న మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు ఉపసంహరణకు గడువు
బైరెడ్డిపల్లి, గరుడదాత్రి అక్టోబరు 24
2026 ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి బైరెడ్డిపల్లి మండలంలోని 16 ప్రాదేశిక నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శనివారం మండల పరిషత్ కార్యాలయంలో పూర్తయింది. మొత్తం 82 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు తెలిపారు. వీరిలో టీడీపీకి చెందిన 31 మంది, వైఎస్సార్‌సీపీకి చెందిన 42 మంది, కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, జనసేనకు చెందిన ఇద్దరు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు.
నియోజకవర్గాల వారీగా ఆలపల్లిలో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–2; బైరెడ్డిపల్లి–1లో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–4; బైరెడ్డిపల్లి–2లో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–3, స్వతంత్ర–1; బేలుపల్లిలో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–4 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి.
చప్పిడిపల్లిలో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–3, కాంగ్రెస్–1, స్వతంత్ర–1; దేవదొడ్డిలో వైఎస్సార్‌సీపీ–3, కాంగ్రెస్–1, జనసేన–2; ధర్మపురిలో టీడీపీ–3, వైఎస్సార్‌సీపీ–3; గొల్లచీమనపల్లి, కడపనత్తం స్థానాల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరేసి అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించారు.
కమ్మనపల్లిలో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–4, కాంగ్రెస్–1; లక్కనపల్లి, ఎం.కొత్తూరు స్థానాల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరేసి; నెల్లిపట్లలో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–3, కాంగ్రెస్–1; పాతపేటలో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–1, కాంగ్రెస్–1; తీర్థం, వెంగంవారిపల్లి స్థానాల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరేసి అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి.
అభ్యర్థిత్వ ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉందని వెంకటరాముడు తెలిపారు. ఉపసంహరించుకోవాలనుకునే అభ్యర్థులు బైరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి నిర్దేశిత ఫారం–VIIలో ఉపసంహరణ నోటీసు సమర్పించాలని సూచించారు.
నామినేషన్ల పరిశీలనలో రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు, సహాయ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ కె. ఆనందబాబు, సహాయ రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్ ఎం.ఎస్. ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
