ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిటీడీపీకి షాక్.. వైసీపీలోకి టీ.ఎన్. కుప్పం టీడీపీ నాయకులు!

టీడీపీకి షాక్.. వైసీపీలోకి టీ.ఎన్. కుప్పం టీడీపీ నాయకులు!

📰 Generate e-Paper Clip

జగన్ సంక్షేమ పథకాలపై నమ్మకంతో వైసీపీలో చేరిక

బైరెడ్డిపల్లి, గరుడదాత్రి, అక్టోబర్ 31:

బైరెడ్డిపల్లి మండలంలోని కడపనత్తం గ్రామ పంచాయతీ పరిధి టీ.ఎన్. కుప్పం గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి, వేమారెడ్డి, నారాయణప్ప తదితరులు టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతోనే వైసీపీలో చేరినట్లు తెలిపారు.
వారికి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మొగసాల కృష్ణమూర్తి, మొగసాల రెడ్డప్ప, దయానంద గౌడ్, శ్రీనివాసులు రెడ్డి, కార్తీక్, మాజీ సర్పంచులు ప్రభాకర్ రెడ్డి, రవిచంద్రబాబు తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!