నాగలాపురంలో టీడీపీ అభ్యర్థుల జోరుగా ఇంటింటి ప్రచారం
తప్పెట తాళాలతో ఘన స్వాగతం
పూలవర్షంతో అభ్యర్థులకు నీరాజనం
నాగలాపురం, అక్టోబర్ 31 గరుడదాత్రి
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శనివారం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మండలంలోని వేంబాకం, గోపాలపురం, కొట్టకాడు, నాగలాపురం వినోబానగర్ తదితర ప్రాంతాల్లో నాగలాపురం ఎంపీటీసీ అభ్యర్థి ప్రేమా సెల్వకుమార్,వేంబాకం ఎంపిటీసి అభ్యర్థి నేసల, జడ్పీటీసీ అభ్యర్థి హేమలత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మేళతాళాలతో అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ పార్టీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి హేమలత మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు. నాగలాపురం తన గుండె లాంటిదని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో భారీ అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ప్రణీత్ రెడ్డి, నాగలాపురం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జాన్సన్, నాగలాపురం సింగిల్ విండో చైర్మన్ సుబ్రహ్మణ్యం రాజు, సీనియర్ నేత యాచేంద్ర నాయుడు, మాజీ ఎంపీపీ మురళి, భాస్కర్ శెట్టి, శ్రీనివాస్ యాదవ్, వేంబాకం గ్రామ టీడీపీ అధ్యక్షుడు యతిరాజులు రెడ్డి, నమశ్శివాయం, పార్థిబన్, రాజవేల్, ఎండీ కుమార్, నరేంద్ర, పృధ్విరాజ్, సానాటి నాగరాజు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
