ePaper
Monday, November 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమాకు ఒక అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం

మాకు ఒక అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం

📰 Generate e-Paper Clip

నాగలాపురం 3వ సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం

ఇంటింటికీ వెళ్లి ఓటర్ల మద్దతు కోరిన మోహనంబాల్, శ్రీనివాస యాదవ్

నాగలాపురం, నవంబర్ 2 గరుడధాత్రి :

ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగలాపురం మండలం 3వ సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థులు మోహనంబాల్, శ్రీనివాస యాదవ్ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమకు ఒక్క అవకాశం కల్పిస్తే సెగ్మెంట్‌ను అభివృద్ధి పథంలో నడిపించి చూపిస్తామని ఓటర్లను అభ్యర్థించారు.
నాగలాపురంలోని ఈశంగాడు, పదమర దళితవాడ, నటరాజుగుంట తదితర గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. తమను ఆశీర్వదించి ఎన్నికల్లో విజయాన్ని అందించాలని కోరారు.
ఈ సందర్భంగా శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఎండీ కుమార్, యువరాజ్, పార్థిబన్, సుధా తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!