ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేట మున్సిపాలిటీలో వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఘన విజయం

నాయుడుపేట మున్సిపాలిటీలో వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఘన విజయం

📰 Generate e-Paper Clip

టీడీపీ అభ్యర్థిపై వైసిపి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ 1,187 ఓట్ల మెజారిటీతో గెలుపు

తిరుపతి జిల్లా, నాయుడుపేట:

నాయుడుపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ్మిరెడ్డి రాజేశ్వరమ్మ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిపై 1,187 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఈ విజయంతో నాయుడుపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ శ్రేణులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ విజయోత్సాహాన్ని పంచుకుంటున్నారు.
తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు లభించిన ఈ విజయంపై వైసీపీ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ, ఓటు వేసి ఆదరించిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 1187 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం నాయుడుపేట రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!