*టిపి కోట రోడ్డులో మరమ్మత్తులు – బస్సు మార్గంలో తాత్కాలిక మార్పులు*
టిపి కోట రోడ్డులో జరుగుతున్న మరమ్మత్తు పనుల కారణంగా రవాణా సౌకర్యాల్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు సత్యవేడు డిపో మేనేజర్ వెంకటరమణ తెలిపారు.
ఈ మేరకు బుధవారం డిపో మేనేజర్ స్వయంగా టిపి కోట రోడ్డును పరిశీలించి, ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పనులు పూర్తయ్యే వరకు సత్యవేడు నుంచి నాగలాపురం వైపు ప్రయాణించే బస్సులు వెల్లూరు సబ్‌స్టేషన్ వరకు మాత్రమే నడుస్తాయని, అక్కడి నుంచి తిరిగి సత్యవేడు దిశగా మళ్లించబడతాయని వివరించారు.
ఈ మార్పులు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమని, రోడ్డు పనులు పూర్తయ్యే వరకు ఈ మార్గం అమల్లో ఉంటుందని తెలిపారు.
ప్రయాణికులు ఈ తాత్కాలిక మార్పులను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాలని, రవాణా శాఖకు సహకరించాలని డిపో మేనేజర్ విజ్ఞప్తి చేశారు.
