ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివైభవంగా చిత్రా పౌర్ణమి సుమంగళి పూజలు

వైభవంగా చిత్రా పౌర్ణమి సుమంగళి పూజలు

📰 Generate e-Paper Clip

శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు చిత్ర పౌర్ణమి -చైత్రమాసం పౌర్ణమి సంధర్భంగా శ్రీ మరగతాంబిగ అమ్మవారికి ఎంతో వైభవంగా సుమంగళి పూజ కార్యక్రమం ఆలయ చైర్మన్ పద్మనాభ రాజు ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారిణి పి. లత సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సుమంగళి పూజలో సుమంగళిలు, కన్యా స్త్రీలు, ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని అమ్మ వారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీ మరగతాంబిక అమ్మవారికి మహా అభిషేకం చేసి అనంతరం చందనకాపు అలంకారం చేసి వివిధ పుష్పాలతో ఆలంకరించారు. సాయంత్రం 5 గంటలకు ప్రదోష మండపం నందు అమ్మవారి ఉత్సవమూర్తికి మీద పుష్పాలతో అలంకరించి అందరూ లలితా సహస్రనామం , ధూప దీప నైవేద్య కార్యక్రమంలో నిర్వహించారు. సుమంగళి పూజలో పాల్గొన్న భక్తులకు పూజకు కావాల్సిన పూజ సామాగ్రిని దేవస్థానం ఏర్పాటు చేసారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో పౌర్ణమి రోజు వివాహం కాని కన్యస్త్రీలు వివాహం కొరకు, సంతాన భాగ్యం కొరకు సుమంగళిలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనవాయితి. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు పి. హంస రుద్రయ్య, కె. శ్రీనివాసులు, ఎస్. క్రిష్ణయ్య, కె. నెల్సన్ మండేలా, ఏ. హేమంత్ కుమార్, ఏ. నాగభూషణమ్మ మస్తాన్ సత్యవేడు నియోజక వర్గం తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!