ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రతిభకు పురస్కారం - ముదిరాజ్ సంఘం నేతల సహకారం

ప్రతిభకు పురస్కారం – ముదిరాజ్ సంఘం నేతల సహకారం

📰 Generate e-Paper Clip

సత్యవేడు మండల పరిధిలోని మదనంబేడు జడ్పీ హై స్కూలో పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి విష్ణును స్థానిక ముదిరాజ్ సంఘం నేతలు శనివారం తన నివాసంలో విస్ట్నుని ఘనంగా సత్కరించారు. విష్ణు
మదనం బేడు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 580 మార్కులు సాధించి మండలానికి తృతీయ స్థానంలో రావడం జరిగింది. తమ సంఘానికి చెందిన ఈ విద్యార్థికి తమ వంతు ప్రోత్సాహంగా 5001 ఆర్థిక సహాయం అందజేశారు. సాలువ, పూలమాలవేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సత్యవేడు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శివయ్య ఆధ్వర్యంలో , విస్ట్నుకు పెద్ద ఈటిపాకం ముని ప్రతాప్, ఎన్టీఆర్ నగర్ శీను, పేరడం గ్రామానికి చెందిన నాగరాజు, చిరంజీవి, బీసీ కాలనీ కుమార్ తమ సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు,రామారావు,సుబ్రహ్మణ్యం, హేమంత్,,పృథ్వి, దయా, రాజేష్, గురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!