ePaper
Tuesday, August 18, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం

విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip


విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు సత్యవేడు మండలంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎపిఎస్ పిడిసిఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు, తిరుపతి జిల్లా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపిఎస్ పి టిసిఎల్ విజిలెన్స్ ఇన్ స్పెక్టర్ విద్యుత్ భద్రతపై గోడపత్రికలను ముద్రించి, సత్యవేడు ఏఈ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు.అనంతరం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రి పరిసరాలు, బస్టాండ్ ప్రాంతాలలో విజిలెన్స్ సిబ్బంది మరియు విద్యుత్ శాఖ సిబ్బంది కలిసి గోడపత్రికలను అతికిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ లైన్ల సమీపంలో జాగ్రత్తలు పాటించడం, అక్రమ కనెక్షన్లు తీసుకోకపోవడం, ప్రమాదకర పరిస్థితులు గమనించిన వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వడం వంటి ముఖ్య సూచనలు ప్రజలకు వివరించారు.విద్యుత్ వినియోగంలో అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించాల్సిందిగా అధికారులు ప్రజలను కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!