ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్ హత్య కేసులో ముద్దాయిలుకు రిమాండ్‌

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్ హత్య కేసులో ముద్దాయిలుకు రిమాండ్‌

📰 Generate e-Paper Clip

గత నెల 28న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను రిమాండ్‌కు పంపినట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు.
జగన్ హత్య అనంతరం బెంగళూరులో నమోదైన పాత కేసులో పోలీసులకు లొంగిపోయిన ప్రధాన నిందితుడు తమీమ్‌ను PT వారెంట్‌పై పలమనేరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.
రిమాండ్ అనంతరం నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించి, హత్యకు గల పూర్తి కారణాలను వెలికితీస్తామని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు.
ఈ ఘటనపై జర్నలిస్టు వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!