ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఘనంగా ముత్యాలమ్మ కొలుపు ఉత్సవాలు

ఘనంగా ముత్యాలమ్మ కొలుపు ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

ప్రత్యేక పూజలు.. ఉచిత వైద్య శిబిరం.. అన్నదాన కార్యక్రమం
——- మండలంలోని కీలపూడి గ్రామంలో శుక్రవారం ముత్యాలమ్మ కొలుపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
జాతర సందర్భంగా గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి చెందిన ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ దివ్య క్యాంపుకు విచ్చేసిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. గ్రామస్తులు ఈ వైద్య శిబిరాన్ని అభినందించారు.
అలాగే కొలుపు ఉత్సవాల్లో భాగంగా బీజేపీ జిల్లా నాయకుడు పాల పద్మనాభం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, అన్నార్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!