శ్రీవారి సారెను ఊరేగింపుగా తీసుకు వచ్చిన శ్రీ గంగమ్మ వారి ఆలయ చైర్మన్..
శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరి అయిన శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారికి జాతరను పురస్కరించుకుని ప్రతి ఏటా టీటీడీ వెంకటేశ్వర స్వామి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా శనివారం తిరుమల నుండి సారెను టీటీడీ అధికారులు శ్రీ గోవిందరాజు స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలకమండలి చైర్మన్ నైనారు మహేష్ యాదవ్ సారెను ఊరేగింపుగా నగర వీధుల్లో మంగళ వాయిద్యాలు కోలాటాల నడుమ అంగరంగ వైభవంగా గంగమ్మ గుడికి తీసుకువచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టిడిపి జిల్లా అధ్యక్షురాలు పనభాక లక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, శాప్ చైర్మన్ రవి నాయుడు, బిజెపి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్, మహానాడు మీడియా కోఆర్డినేట్ మెంబర్ శ్రీధర్ వర్మ, టిడిపి సీనియర్ నేత జేబీ శ్రీనివాస్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రఘురాం, సుబ్బు యాదవ్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
