గంగమ్మ జాతరకు రూ.1,05000/- విరాళం అందించిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పామాంజి మురళి @ కోళ్ళచిన్న
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మురళి అలియాస్ కోళ్ళచిన్న మరోసారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.వినాయక చవితి పండుగ రోజుల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు విరివిగా విరాళాలు అందిస్తూ సేవా దృక్పథాన్ని చాటుకొన్నారు.
అదే తరహాలో సత్యవేడు, దలవాయి అగ్రహారం గ్రామాల్లో జరగనున్న గంగ జాతరను పురస్కరించుకొని 105000 రూపాయలు విరాళంగా అందించారు.శనివారం సత్యవేడు గంగ జాతర ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు అడ్వకేట్ గోపీనాథ్,రాజేష్,ప్రసాద్ తదితరులు కలిసినప్పుడు మురళి 55 వేల రూపాయలు విరాళంగా అందజేయగా,అలాగే దలవాయి అగ్రహారం గంగ జాతరకు సంబంధించి పురుషోత్తం రెడ్డి,గణేష్, ఈశ్వరయ్య,మునస్వామి,వీరాస్వామి తదితరులు మురళికి సాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మురళి 50 వేల రూపాయల విరాళాల సొమ్మును వారికి అందజేయడం జరిగింది.
