పిచ్చాటూరులో గత 25 ఏళ్లుగా వ్యాపారం చేస్తూ అందరికీ సుపరిచితుడు ఆయన ఎం.గోపి సోమవారం హఠాన్మరణం చెందారు.
గోపి పది రోజుల క్రితం ఆదివారం రోజున తన మోటార్ సైకిల్ పై వెళ్తూ పెట్రోల్ బంక్ వద్ద అదుపుతప్పు బోల్తా పడ్డారు.
ఈ రోడ్డు ప్రమాదంలో గాయాల తో చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
గోపి స్వగ్రామం కొప్పేడు లో మంగళవారం ఉదయం 9.00 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
గోపి మృతి పట్ల పిచ్చాటూరు లోని వ్యాపారస్తులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
