ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివెటరన్ జర్నలిస్ట్స్ డైరీని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

వెటరన్ జర్నలిస్ట్స్ డైరీని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

📰 Generate e-Paper Clip

వెటరన్ జర్నలిస్ట్స్ డైరీని ఆవిష్కరించిన
జిల్లా కలెక్టర్
-పెన్షన్ మంజూరు కై ప్రభుత్వానికి సిపార్స్

గరుడధత్రి :

వెటరన్ జర్నలిస్ట్ లకు పెన్షన్ మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిపార్సు చేస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలియజేయారు.. శుక్రవారం తిరుపతి కలెక్టర్ చాంబర్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లా వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీసికువచ్చిన 2025-26 సంవత్సరపు డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు..ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వెటరన్ జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం జిల్లా అసోసియేషన్ చేస్తున్న కృషిని కొనియాడారు.దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలో వెటరన్ జర్నలిస్ట్ లకు ప్రభుత్వాలు పెన్షన్ అందజేస్తున్నట్లు అసోసియేషన్ నేతలు తెలిపారు,,ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు మాత్రమే దక్షిణ భారత్ లో ఈ విషయం లో వెనకబడ్డాయని పేర్కొన్నారు.అర్హులైన సీనియర్స్ జర్నలిస్ట్ లకు పెన్షన్ మంజూరు విషయం ఎంతో సమంజసమని రాష్ట్ర ప్రభుత్వంనకు సానుకూలంగా ప్రతిపాదన పంపగలనని కలెక్టర్ భరోసా ఇచ్చారు ..ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్,, జాతీయ ఉపాధ్యక్షులు డా. టి. జనార్దన్, జిల్లా కార్యదర్శి కె.. చంద్రశేఖర్,సహాయ కార్యదర్శి యం. సుభ్రమణ్యంరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ను దుశ్శాలువతో సన్మానించారు..ఈ కార్యక్రమం లో సీనియర్ జర్నలిస్ట్ లు,, యాసిన్,, జి. సుకుమార్,, కృష్ణమూర్తి,, మునికృష్ణయ్య, సుధాకర్ రెడ్డి,, రాజగోపాల్,అల్లాభక్ష్,, కోటయ్య,రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ,

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!