ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కర్నూలుతెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్... మహానాడు లో పనబాక లక్ష్మి

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్… మహానాడు లో పనబాక లక్ష్మి

📰 Generate e-Paper Clip

తిరుపతి, మే 28 గరుడధాత్రి :
ఆత్మగౌరవానికి ప్రత్యేక స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి చెప్పారు. మంగళగిరిలో ఎన్టీఆర్ జయంతి నీ పురస్కరించుకొని రెండో రోజు మహానాడు లో పనబాక లక్ష్మి ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ నీ స్థాపించడం ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు తీసుకువచ్చిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. మహానేత ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం నాయకులు కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజాసేవే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని మహానాడు వేదికగా తీసుకుని నిర్ణయాలు ప్రజలకు మరింత మేలు చేకూర్చేలా ఉంటాయని చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పనబాక లక్ష్మి కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!