గరుడధాత్రి :
శ్రీకాళహస్తి (M) అరవకొత్తూరు గ్రామానికి చెందిన మునివేలు అనే రైతు ట్రాక్టర్ గత నెల 20వ తేదీన చోరీకి గురైందని సీఐ ఇబ్రహీం తెలిపారు.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మే 31 ఆదివారం సాయంకాలం చంద్రశేఖర్, సుధీర్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు.
వారి వద్ద నుంచి రూ.4.5 లక్షల విలువచేసే ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు.
