ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌లో జిల్లా టాప్‌గా పిచ్చాటూరు మండలం

ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌లో జిల్లా టాప్‌గా పిచ్చాటూరు మండలం

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, జూన్ 13 గరుడధాత్రి : తిరుపతి జిల్లాలోని 46 మండలాల్లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్ ప్రక్రియలో పిచ్చాటూరు మండలం 87.7 శాతం ప్రగతితో ప్రథమ స్థానంలో నిలిచింది.ఈ సందర్భంగా మండల ప్రజలకు, ఎన్నికల సిబ్బందికి, రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగులకు తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి సమిష్టి కృషి, సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు.భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రజలు, అధికారులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. పిచ్చాటూరు మండలం జిల్లాలో మొదటి స్థానంలో నిలవడం పట్ల అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!