ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పిచ్చాటూరు మండలంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

పిచ్చాటూరు మండలంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, జూన్ 13 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలంలో విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే నిర్వహణ పనుల కారణంగా నేడు (శనివారం) విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. నిర్వహణ పనులు సజావుగా పూర్తయ్యేందుకు ప్రజలు సహకరించాలని, ఈ సమయంలో కలిగే అసౌకర్యాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.
ఈ మేరకు పిచ్చాటూరు విద్యుత్ శాఖ సీనియర్ లైన్మెన్ గిరి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!