ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
HomeతిరుపతిTirupatiకుప్పంలో 26 న బిజెపి నియోజకవర్గ స్థాయి సమావేశం.

కుప్పంలో 26 న బిజెపి నియోజకవర్గ స్థాయి సమావేశం.

📰 Generate e-Paper Clip

రాయలసీమ బిజెపి సర్ ఇంచార్జ్, జిల్లా ఇంచార్జ్, జిల్లా అధ్యక్షులు హాజరు.
బిజెపి కుప్పం నియోజక వర్గ ఇన్చార్జ్ తులసి నాథ్.
కుప్పం,జులై 24 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గ స్థాయి భారతీయ జనతా పార్టీ ప్రత్యేక సమావేశాన్ని ఈనెల 26వ తేదీ ఆదివారం కుప్పంలో నిర్వహిస్తున్నట్లు కుప్పం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్, కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ డైరెక్టర్ ఎన్.ఎస్. తులసినాథ్ తెలిపారు. శుక్రవారం కుప్పంలో ఆయన విలేకరులకు ఈ సమావేశ వివరాలు తెలిపారు. కుప్పం క్రిష్ణగిరి సర్కిల్లోని తారక్ గేట్వే లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశానికి, రాయలసీమ భారతీయ జనతా పార్టీ సర్ ఇంచార్జ్, చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్, చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి కుప్పం నియోజక వర్గంలోని మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, బిఎల్ఎ టు, పార్టీ నాయకులు హాజరుకావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!