ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయాన్ని దర్శించుకున్న ప్రభుత్వ విప్

ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయాన్ని దర్శించుకున్న ప్రభుత్వ విప్

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం జూలై 24 (గరుడ దాత్రి న్యూస్):

కార్వేటినగరంలో వెలసిన ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో ఉదయం ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు పెరుగు తేనె హరిద్రవం చందనం పసుపు తో కూడిన అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద రాహుకాలం పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఆలయానికి చేరుకున్న గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయాన్ని చేరుకున్న శాసనసభ్యులను ఆలయ కమిటీ ఘనంగా సన్మానించారు.ఆలయం దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి గౌతమ్ రాజు, ఉపాధ్యక్షులు రవి రెడ్డి, కోశాధికారి లక్ష్మీపతి మొదలియార్, ఉప కోశాధికారి సాయి రాయల్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!