ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం జూలై 21 (గరుడ దాద్రి న్యూస్)
కార్వేటి నగరంలో వెలిసిన గ్రామ దేవత శ్రీ బంగారమ్మ ఆలయంలో మంగళవారం ఉదయం ఆలయంలో అమ్మవారికి పాలు పెరుగుతేనే హరిద్రవ చందనం కూడిన అభిషేక అర్చన నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద అమ్మవారికి మహిళలు పొంగళ్ళు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఆలయం వద్ద అమ్మవారికి రాహుకాలం పూజలు కుంకుమార్చనలు దీపారాధన నిర్వహించారు. భక్తుల అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొప్పేటి ప్రసాద్ రాయల్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ పిళ్ళై, ఉపాధ్యక్షులు రంగనాథ మొదలియార్, కమిటీ సభ్యులు భక్తులు అమ్మవారిని అది సంఖ్యలో దర్శించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!