ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోండి

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోండి

📰 Generate e-Paper Clip

కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్):
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం ఆదేశించారు.పాజిటివ్ పీపుల్ పర్సెప్షన్ కార్యక్రమంలో భాగంగా వైస్ చైర్మన్ కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
బస్టాండ్ పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, బస్సుల సమయపాలన, తాగునీటి వసతులను పరిశీలించారు. అనంతరం ప్రయాణికులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు,సూచనలు తెలుసుకున్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు నాణ్యమైన, సమయపాలనతో కూడిన, పరిశుభ్రమైన ఆర్టీసీ సేవలను అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు, కుప్పం డిపో మేనేజర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!