ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం

అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

పలమనేరు ఆగస్టు 11 ( గరుడ ధాత్రి ) :

పలమనేరు మండలంలో జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ నందు పలమనేరు మండలం అంగన్వాడి కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సిడిపిఓ ఉమారాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింద ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం ఈ ఓ 1 లీల రాణి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందన్నారు. సిడిపిఓ ఉమారాణి శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నవ చేతన, ఆధార్ శీలా ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు.ఈ ట్రైనింగ్ లో పిల్లలలో జరిగే 0-3 సంవత్సం నుండి, 3-6 సంవత్సరం పిల్లలలో జరిగే సమగ్ర అభివృద్ధి, మెదడు అభివృద్ధి గురించి, మదర్ ఐడియా కార్డ్స్ గురించి, ఎఫ్ ఎల్ ఎన్ గురించి, ఇంగ్లీష్ ని పరిచయం చేయడం గురించి, ఫ్రీస్కూల్ నమోదు శాతాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాలు పైన క్లుప్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ట్రైనింగ్ 11/08/2026 నుండి 13/08/2026 వరకు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వివరించే అంశాలను అంగన్వాడి కార్యకర్తలు క్షుణ్ణముగా జ్ఞానోదయం చేసుకొని అంగన్వాడి కేంద్రాల్లో అమలుపరిచే విధంగా చూడాలన్నారు.స్కూల్ టీచర్స్ డిఆర్పిఎస్, నాగరాజు , చందు, యతీష్ , అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!