ePaper
Thursday, October 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు

📰 Generate e-Paper Clip

పలమనేరు, అక్టోబర్ 01 ( గరుడ ధాత్రి ) : పలమనేరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో పలమనేరు డివిజన్ పరిధిలోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు సమర్పించిన విద్యార్హతలు, వయస్సు, కుల ధ్రువీకరణ, నివాస తదితర ధ్రువపత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అర్హులైన అభ్యర్థులకు ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలమనేరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) భవాని, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జి. వెంకట ప్రసాద్ , మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కె. శ్యామ్ సుగుణకుమారి , శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులు (సీడీపీవో) ఉమారాణి , అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!