ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅంగరంగ వైభవంగా..చెర్లోపల్లిలో గోళ్ల స్వామి తిరుణాళ్లు

అంగరంగ వైభవంగా..చెర్లోపల్లిలో గోళ్ల స్వామి తిరుణాళ్లు

📰 Generate e-Paper Clip

అంగరంగ వైభవంగా..చెర్లోపల్లిలో గోళ్ల స్వామి తిరుణాళ్లు

మండలం లోని
చెర్లోపల్లి గ్రామంలో వెలసినటువంటి శ్రీ గోవిందరాజు స్వామి(గోళ్ళ స్వామి )దేవస్థానంలో బుధవారం 99 జయంతి ఉత్సవాల నిర్వహించారు. 99 సంవత్సరాల క్రితం చెర్లోపల్లి కి గోవిందరాజుల స్వామి విచ్చేసారు. చెర్లోపల్లి గ్రామంలోగోళ్ల స్వామి దేవాలయంలో పల్లకి సేవ అభిషేకాలు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం జరిగాయి. గ్రామస్తుల సమక్షంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.. నరేందర్ రెడ్డి చెన్నూరు నరేన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం స్వామివారి గ్రామ్మో త్సవం నిర్వహించారు. గోళ్ల స్వామి తిరుణాల పురస్కరించిన దేవాలయం లైటింగ్ తో ముస్తాబు చేశారు. కార్యనిర్వాహులు కుండా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు గ్రామస్తులు ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కలికి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వేణుగోపాల్ రెడ్డి కలికి కోదండరామిరెడ్డి కలికి రాజారాంరెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దారు. చిల్లకూరు మోహన్ రామిరెడ్డి పర్యవేక్షణలో పెంయిట్లు వేయించడం జరిగింది. చిల్లకూరు మోహన్ రామిరెడ్డి సొంత నిధులతో ఆంజనేయ పైకప్పు మరమ్మత్తులు చేశారు. మరియు సొంత నిధులతో పెయింట్లు కూడా వేయించారు . ప్రతి సంవత్సరం గోళ్ల స్వామితిరుణాల్లు చెర్లోపల్లిలో గ్రామస్తులు ఏటా మే నెలలో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని పూజారి శ్రీరాముల స్వామి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!