ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిఅట్టహాసంగా...చరిత్రలో నిలిచే విధంగా...మండల పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం..!!

అట్టహాసంగా…చరిత్రలో నిలిచే విధంగా…మండల పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం..!!

📰 Generate e-Paper Clip

అట్టహాసంగా…చరిత్రలో నిలిచే విధంగా…మండల పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం..!!

 * సత్యవేడులో శంకర్ మార్కు రాజకీయం

మునుపెన్నడు లేని విధంగా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా… కార్యకర్తల హర్షద్వనాల మధ్య కొనసాగింది జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీ పనబాక లక్ష్మి సీనియర్ జిల్లా నాయకులు నరసింహ యాదవ్ పరివేక్షణలో ప్రమాణ స్వీకారం చేయించారు గతంలో అయితే ఆ మండల కేంద్రాల్లో మండల టిడిపి అధ్యక్షులను ఎన్నుకోవడం, అక్కడే కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారోత్సవం చేయించేవారు. అయితే ప్రస్తుత టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి తన రాజకీయ మార్కును ఈ వ్యవహారంలో చూపించి, అందరి నోట భలే చేయించారు ఈ కార్యక్రమాన్ని, నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల నాయకులు కార్యకర్తలు ఒకే వేదిక వద్ద సమావేశమై… కలుసుకోవడం, ఆప్యాయతగా పలకరించుకోవడం తద్వారా స్నేహపూర్వకమైన వాతావరణంలో మండల పార్టీ అధ్యక్షులు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా అద్భుతంగా… టిడిపి చరిత్రలో నిలిచే విధంగా రూపొందించి శభాష్ శంకర్ రెడ్డి అనిపించుకున్నారు.

 

పెత్తందారి కాదు.. *మన శంకరన్న..*

*మన స్థానికుడు.*.💥

ఒకే వేదికపై మండల పార్టీ అధ్యక్షులుగా పరుచూరి శివకుమార్ నాయుడు( సత్యవేడు) యుగంధర్ రెడ్డి( వరదయ్యపాలెం) గిరిబాబు( నారాయణవనం) చెంచురామానాయుడు( బుచ్చినాయుడు కండ్రిగ ) మునస్వామి యాదవ్( కే వి బి పురం ) ప్రణీత్ రెడ్డి( నాగలాపురం) మునికృష్ణమనాయుడు ( పిచ్చాటూరు ) లను తీసుకువచ్చి ఆయా మండల కార్యకర్తల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అందర్నీ ఆకట్టుకునే విధంగా ప్రణాళిక వేసి ఆ దిశగా కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేయడం కూడా జరిగింది ఈ మండల పార్టీ అధ్యక్షులు ఎంపిక వ్యవహారం లో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ… శంకర్ రెడ్డి అన్ని తానై… అధిష్టానం దగ్గర ఆమోదముద్ర వేసి కార్యకర్తలే కీలకం… వారే పార్టీకి వెన్నుముక అనే విధంగా భావించి వారి సమక్షంలోనే ఎటువంటి అసంతృప్తి వ్యవహారం లేకుండా ప్రమాణ స్వీకారోత్సవం పెద్ద పండుగ వాతావరణం లో నిర్వహించారు తమిళనాడు సరిహద్దులోని దాసుకుప్పం నుంచి భారీ వాహనాల ర్యాలీ కార్యక్రమం స్థానిక వి ఎం కే వేదిక వరకు నిర్వహించారు అక్కడి నుంచి భారీ టపాసు శబ్దాలతో… వివిధ రకాల వాయిద్యాలతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఏడు మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకుని… ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా పూర్తి చేశారు మండల పార్టీ అధ్యక్షులు పనితీరు… ప్రతి కార్యకర్త మనసును మెప్పించుకునే విధంగా కొనసాగాలని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క పేదలకు అందాలని, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా సాగాలని పిలుపునివ్వడం కూడా జరిగింది… *మన స్థానికుడు… మన రేపల్లెవాడవాసి… మన శంకరన్న కు వెనుదన్నుగా ఉండి…* పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల్లో ప్రతి పల్లెలోనూ తెలుగుదేశం జెండా శాశ్వతంగా ఉండాలని సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. *మన శంకరన్న*.. పార్టీ అధిష్టానం ఇచ్చే ప్రతి సూచనను, ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారని, అందువల్లే విమర్శలు ఎక్కువ వస్తున్నాయని, ఈ విషయాన్ని కూడా పార్టీ అధిష్టానం గుర్తిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలన్నారు *మన లక్ష్యం… మన అందరి లక్ష్యం ఒక్కటే… అదే స్థానిక ఎన్నికల్లో టిడిపి మద్దతుదారులు విజయదుందుభి సాధించడమే లక్ష్యం..* అనే విధంగా పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!