ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం... టిడిపి తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి జె...

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం… టిడిపి తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి జె డబ్ల్యూ విజయ్ కుమార్

📰 Generate e-Paper Clip

ఇందిరా నగర్ లో డోర్ టు డోర్ తెలుగుదేశం పార్టీ

తిరుపతి, ఆగష్టు 2 గరుడధాత్రి :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని టిడిపి తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు జెడబ్ల్యు విజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం 24వ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ లో డోర్ టు డోర్ తెలుగుదేశం కార్యక్రమం జే డబ్ల్యు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా 24వ డివిజన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే మూడేళ్ల కాలంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రముగా అభివృద్ధి చెందబోతోందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ముందుకు నడుస్తుందని తెలిపారు. పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని, ఇప్పటికే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 95 శాతానికి పైగా పథకాలను అమలు చేసిన ఘనత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దేనని జే డబ్ల్యు విజయ్ కుమార్ తెలిపారు. 2029 లో కూడా తెలుగుదేశం నేతృత్వంలోని బిజెపి జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 24 డివిజన్ టిడిపి నేతలు మల్లెపూల సుబ్రహ్మణ్యం, చంద్రబాబు, దిలీప్ కుమార్ ఏ గంగాధర్ ధనలక్ష్మి కేకే చెల్లప్ప జి అరుణ్ జలకం రాజేష్, బద్రి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!