ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅమ్మవారి సేవలో ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్

అమ్మవారి సేవలో ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్

📰 Generate e-Paper Clip

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఇండియా ఎలక్షన్ కమిషనర్ కి టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవీఎస్వో రాధాకృష్ణ మూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న ఇండియన్ ఎలక్షన్ కమిషనర్ కి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు, చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, అడిషనల్ ఎస్ పి రవి మనోహరాచారి, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!