ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు..

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు..

📰 Generate e-Paper Clip

*అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు..*

* ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*

* నిరుద్యోగులకు ఉపాధి భరోసా జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే*

సత్యవేడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల ముంగిటకే తీసుకెళ్తోంది అని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు

శుక్రవారం నారాయణవనం మండలంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జడ్పీ ఫైనాన్స్ కమిటీ మెంబర్ కోనేటి సుమన్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు.

అర్హులైన లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీనే తూచా తప్పకుండా పింఛన్లు అందిస్తోందని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అన్నారు

ఒకవేళ ఎవరికైనా పింఛన్ అందకపోతే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్ నెలలో మరిన్ని కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం అని ఆయన భరోసా ఇచ్చారు.

నారాయణవనం మేజర్ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, రాబోయే మే 6వ తేదీన కె.వి.బి.పురంలో నిర్వహించనున్న జాబ్ మేళా క్యాలెండర్ పోస్టర్‌ను ఎమ్మెల్యే గారు, సుమన్ కుమార్ ఆవిష్కరించారు.

చదువుకున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని వారు పిలుపునిచ్చారు.

అంతకుముందు నారాయణవనం హైవే లో ఫర్నిచర్ షాపులను ప్రారంభించారు

*పంచాయతీలో పన్ను రాయితీలు…*

ఈ సందర్భంగా మరో శుభవార్తను ప్రకటించారు. మునిసిపాలిటీల్లో ప్రజలకు కల్పించే పన్ను రాయితీలను, నారాయణవనం మేజర్ పంచాయతీ ప్రజలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానికులు ఈ పన్ను రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణ, ఈవో రవి, బీజేపీ మండల అధ్యక్షులు కుమరేషన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కూటమి ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!