ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఉచితం లేదోయ్... నాలుగు వేలు ఇవ్వాల్సిందే -సత్యవేడులో ఇసుక వ్యాపారం...

ఉచితం లేదోయ్… నాలుగు వేలు ఇవ్వాల్సిందే -సత్యవేడులో ఇసుక వ్యాపారం దందా..!

📰 Generate e-Paper Clip

ఉచితం లేదోయ్…
నాలుగు వేలు ఇవ్వాల్సిందే
-సత్యవేడులో ఇసుక వ్యాపారం దందా

గరుడధాత్రి న్యూస్ :

ఇల్లు కట్టుకుంటున్నారా… ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తుంది… ఇది చెవులారా వినడానికి మాత్రమే… నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడులో నిర్మాణాలకు ఇసుక కొరత తీవ్రంగా ఉంది ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారు విధి లేక వేలుకు వేలు పోసి ఇసుకను పొందాల్సిన దయనీయ పరిస్థితి వచ్చింది సత్యవేడుకు ఇసుక రావాలంటే … నాగలాపురం మండలం సుబ్బానాయుడు కండ్రిగ, కారని ప్రాంతాల నుంచి తీసుకురావాల్సిందే. అయితే ట్రక్కు ఇసుక నేడు 4 వేలు నుంచి 4500 చొప్పున కొనుగోలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది ఇదే అదునుగా కొందరు ధరలు పెంచి నిర్మాణదారి నుంచి డబ్బులు బాగా గుంజుకుంటున్నారు మరికొందరు ఇదే అదునుగా లోకల్ లోకల్ అంటూ… సత్యవేడు మండలం నుంచి తమిళనాడులోని ఎన్ ఎం కండ్రిగ, అచ్చమ్మ నాయుడు కండ్రిగ, మాదర పాకం, మా నెల్లూరు ప్రాంతాలకు తరలించి ట్రక్కు ఇసుకను అక్కడ 8 వేలు చొప్పున విక్రయిస్తున్నారు సరిహద్దులో నిఘా ఉంచాల్సిన పోలీస్ శాఖ నిద్రవస్థకు చేరిపోయిందనే విమర్శలు ఉన్నాయి ఇంకేముంది ఇసుక స్మగ్లర్లు బరితెగించి…. మధ్యాహ్నవేళలోనే తమిళనాడుకు ఇసుకను తరలిస్తున్నారు ఉచిత ఇసుక లేకపోగా… ట్రక్కు ఇసుకను 4000 నుంచి 5000 వరకు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వీటిపై పూర్తిస్థాయి పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు… తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం వల్ల ఇసుక ధరలు ఆకాశంలోకి చేరిపోతున్నాయని నిర్మాణదారులు గగ్గోలు పెడుతున్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!