పలమనేరు, సెప్టెంబర్ 03 ( గరుడ ధాత్రి ) :
శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలమనేరు మండల విద్యాశాఖ అధికారులు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు వివిధ క్రీడా పోటీలు గురువారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభమయ్యాయి.
మండల విద్యాశాఖ అధికారులు పి.లీలారాణి, పి.సుజాత, గవర్నమెంట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు షంషీర్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు.
పీడీలుగా వ్యవహరించిన అల్తాఫ్, సుజాత, కృష్ణవేణి, సాజీయా ఉపాధ్యాయులకు పోటీలను నిర్వహించారు. ఉపాధ్యాయ నాయకులు భాస్కర్(గుండుబావి) లక్ష్మీనారాయణ, భాస్కర్ (ముసలిమడుగు)పాఠశాల ఉపాధ్యాయులను కలిసి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఉపాధ్యాయుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, పరస్పర స్నేహభావం, టీమ్ స్పిరిట్‌ను పెంపొందించడమే క్రీడా పోటీల ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నందున వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, చెస్ తదితర పోటీల్లో నేడు పాల్గొన నున్నారు. పోటీల ప్రారంభంతో ఆ పాఠశాల ఆవరణలో సందడి నెలకొంది.
