ఉమ్మడి నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ శకం ముగిసిందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. నెల్లూరులో గెలవలేననే భయంతోనే అనిల్ నెల్లూరును విడిచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరు పార్టీ బాధ్యతలను అప్పగించారు జగన్. ఒక పక్క పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీని వీడి వెళ్లిపోతున్నా సరే అనిల్ పట్టించుకోలేదు. నియోజకవర్గం మిగిలిన అరకొర కార్యకర్తలను కాపాడుకోడానికి చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నించారు. అంతే కాకుండా విద్యా సంస్థల అధినేత కావడంతో చంద్రశేఖర్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం అండగా నిలబడింది. ఈ క్రమంలోనే అనిల్ మళ్లీ నెల్లూరు వైపు చూస్తున్నారు. ఏడాదిన్నరగా చెన్నైకే పరిమితం అయిన అనిల్.. ఇప్పుడు సడెన్ గా నెల్లూరు రాజకీయాల్లో వేలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. దీంతో ఈ విషయం కాస్తా జగన్ దాకా వెళ్లింది. దీంతో అనిల్ పై జగన్ సీరియస్ అయినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.
పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు సొంత లాభం కోసం పట్టించుకోకుండా వెళ్లిపోయిన అనిల్.. ఇప్పుడు మాత్రం తిరిగి రావడాన్ని సహించేది లేదని చంద్రశేఖర్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. జగన్ కూడా చంద్రశేఖర్ రెడ్డికే మద్దతు తెలిపారంట. అనిల్ ను నెల్లూరు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పారంట. ఇంకేముంది అనిల్ శకం నెల్లూరులో ముగిసినట్టే అని చెబుతున్నారు వైసీపీ కార్యకర్తలు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయిన వారిలో అనిల్ కూడా ఒకరు. ఆయన వల్ల వైసీపీకి తీవ్ర నష్టమే జరిగింది. జగన్ ను మెప్పించడానికి ప్రతిపక్ష టీడీపీ నేతలపై ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడిన వ్యక్తి ఈ అనిల్. ఏ ఒక్క విషయంలోనూ మంత్రిగా ఆయన మంచి పేరు తెచ్చుకోలేదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత సంపాదించుకున్నారు. అందుకే అనిల్ వల్ల వైసీపీకి మరింత నష్టం అని కార్యకర్తలు కూడా వద్దని చెబుతున్నారంట. మరి నెల్లూరు కాకుండా అనిల్ ఎటు వైపు చూస్తారో వేచి చూడాలి.
ఉమ్మడి నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ శకం ముగిసిందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. నెల్లూరులో గెలవలేననే భయంతోనే అనిల్ నెల్లూరును విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరు పార్టీ బాధ్యతలను అప్పగించారు జగన్. ఒక పక్క పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీని వీడి వెళ్లిపోతున్నా సరే అనిల్ పట్టించుకోలేదు. నియోజకవర్గం మిగిలిన అరకొర కార్యకర్తలను కాపాడుకోడానికి చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నించారు. అంతే కాకుండా విద్యా సంస్థల అధినేత కావడంతో చంద్రశేఖర్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం అండగా నిలబడింది. ఈ క్రమంలోనే అనిల్ మళ్లీ నెల్లూరు వైపు చూస్తున్నారు. ఏడాదిన్నరగా చెన్నైకే పరిమితం అయిన అనిల్.. ఇప్పుడు సడెన్ గా నెల్లూరు రాజకీయాల్లో వేలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. దీంతో ఈ విషయం కాస్తా జగన్ దాకా వెళ్లింది. దీంతో అనిల్ పై జగన్ సీరియస్ అయినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.
