ePaper
Thursday, October 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం

ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

* మాట ప్రకారం ప్రతి నెలా 1వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.
* రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం చంద్రబాబు.
* కుప్పం అర్బన్ టిడిపి ఉపాధ్యక్షులు ఆర్.శ్రీనివాసులు.
కుప్పం, అక్టోబర్ 01 (గరుడ ధాత్రి న్యూస్): ఎన్నికల హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కుప్పం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆర్.శ్రీనివాసులు అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని 16వ వార్డులో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ నిలబెట్టుకున్నారన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీని నెరవేరుస్తూ, వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు పింఛన్ మొత్తాన్ని రూ. 4,000లకు పెంచి పంపిణీ చేస్తున్నామన్నారు.వికలాంగులకు రూ. 6,000, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రూ. 15,000 వరకు పెంచి అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు దేశంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కార్యక్రమం అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసినప్పటికీ, కూటమి ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ కేటాయింపులు జరుపుతోందన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రతినెల 1వ తేదీ ఉదయాన్నే వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ సొమ్మును అందిస్తున్నామన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు .ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం కుప్పం మున్సిపల్ 16వ వార్డులో ఉదయం 6:30 గంటల నుండి పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కో క్లస్టర్ ఎస్. శ్యాంసుందర్,టౌన్ బ్యాంక్ చైర్మన్ మంజునాథ్, ఉపాధ్యక్షులు ప్రకాష్, బూత్ ఇంచార్జ్ విష్ణు, కో బూత్ ఇంచార్జ్ లలిత్ సాగర్గారు, హర్ష మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!