హార్టీకల్చర్ హబ్ ప్రోగ్రామ్ తో మారనున్న పరిస్థితులు
మదనపల్లి ప్రోగ్రామ్ ను విజయవంతం చేయండి… ఎమ్మెల్యే అమర్
పలమనేరు, అక్టోబర్ 01 ( గరుడ ధాత్రి ) : రాయలసీమ అభివృద్ధికి కీలక ముందడుగు పడిందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతలతో గురువారం ఆయన సమావేశం నిర్వహించి కార్యక్రమ విజయవంతానికి చేపట్టాల్సిన అంశంపై చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. దేశంలోనే ఏ ప్రాంతానికి కేటాయించిన విధంగా ప్రత్యేక ప్యాకేజీ తో రాయలసీమ జిల్లాలకు హార్టికల్చర్ హబ్ ద్వారా కూటమి ప్రభుత్వం లక్ష కోట్లను ఖర్చు చేయని ఉండడం శుభపరిణామన్నారు. దీంతో రాయలసీమ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు చేకూరుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేపు మదనపల్లిలో ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని నియోజకవర్గము నుంచే గాక జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు నాయకులు కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పలమనేరు నియోజకవర్గం నుంచి తరలి వెళ్లే నాయకుల వాహనాల పార్కింగ్ మరియు భోజన ఏర్పాట్లు తదితరాలపై నాయకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమశేఖర్ గౌడ్, రాంబాబు,నాగరాజు రెడ్డి, కుట్టి, ,ఖాజా, గిరి, జనసేన నాయకులు పూల చైతు, నాగరాజు,చందు, మురాదు తదితరులున్నారు.
