ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పిచ్చాటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పిచ్చాటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు ఆగస్టు 15 గరుడధాత్రి:

మువ్వన్నెల జెండా రెపరెపలాడగా.. దేశభక్తి స్ఫూర్తితో పిచ్చాటూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!