ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నీరువాయి గ్రామపంచాయతీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నీరువాయి గ్రామపంచాయతీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు ఆగస్టు 15 గరుడధాత్రి:

మువ్వన్నెల జెండా రెపరెపలాడగా.. దేశభక్తి స్ఫూర్తితో పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామపంచాయతీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణంలో నిర్వహించిన వేడుకల్లో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ ఎంపీడీవో శ్రీ రవికుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. వెంకటరమణ స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను వివరించారు. విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణతో విద్యనభ్యసించి దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టి. బాలాజీ, గ్రామ సర్వేయర్ మునీశ్వరయ్య, నీరువాయి గ్రామ పెద్దలు, ఎంపీపీ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేసి సంతోషోత్సాహాల మధ్య కార్యక్రమాన్ని ముగించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!